
భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది.
ఇటీవల విడుదలైన భోళా శంకర్ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో అభిమానులు కొంత ఆందోళన చెందారు.
ఎందుకంటే భోళాశంకర్ సినిమాకు పోటీగా రజనీకాంత్ జైలర్, అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న యానిమల్ కూడా అదే టైంలో రిలీజ్ అవుతున్నాయి.
మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలయితే దాని ప్రభావం వసూళ్ల మీద ఉంటుందని అభిమానులు ఆందోళన చెందారు.
Details
డిసెంబరులో రానున్న యానిమల్
ప్రస్తుతం ఈ విషయంలో భోళాశంకర్‌కు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే యానిమల్ రిలీజ్ వాయిదా పడిందని సమాచారం. అనుకున్నట్లుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగకపోవడం వల్ల యానిమల్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కావాల్సిన యానిమల్ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారట. దీంతో ఇది భోళా శంకర్ సినిమాకు కలిసివచ్చే అవకాశం ఉంది.
యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.