తదుపరి వార్తా కథనం
భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి
వ్రాసిన వారు
Sriram Pranateja
Jun 08, 2023
09:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
భోళాశంకర్ సినిమా నుండి రిలీజైన మొదటి పాట భోళా మ్యానియాకు అభిమానులు స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. లూప్ లో పెట్టుకుని భోళా మ్యానియా పాటకు చిందులేస్తున్నారు.
ప్రస్తుతం భోళాశంకర్ సినిమా నుండి రెండవ పాటను లీక్ చేసారు చిరంజీవి. ఇంస్టాగ్రామ్ వేదికగా, పాట తాలూకు షూటింగ్ వీడియోను షేర్ చేసారు.
ఈ వీడియో చూస్తుంటే సంగీత్ పార్టీలో జరిగే పాటలా అనిపిస్తుంది. సినిమాలో నటిస్తున్న అందరూ ఈ వీడియోలో కనిపించారు.
ఈ వీడియో చివర్లో, పాట హుక్ లైన్ ని రివీల్ చేసారు. సెకండ్ సాంగ్ కూడా అందర్నీ అలరించేలా ఉండబోతుందని హుక్ లైన్ తో అర్థమవుతోంది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది.