LOADING...
Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం
రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం

Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదానికి త్వరలోనే ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే ఎగ్జిబిటర్లు ఆయనతో రెండోసారి సమావేశమై సమస్య పరిష్కారానికి పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు

వివాదానికి పరిష్కారం..

ఇక మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచిన సందర్భంలో, అదనంగా వచ్చిన ఆదాయంలో 7.5 శాతం మొత్తాన్ని చెల్లించేందుకు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య తాజా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ షేరింగ్ అంశంపై వాదనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇరువర్గాల మధ్య సమన్వయం తీసుకురావడానికి చిరంజీవి వరుసగా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి వివాదం మరింత పెరగకుండా పరిష్కార మార్గం చూపించినట్లు చెబుతున్నారు.

వివరాలు

చర్చలు సఫలం..మెగాస్టార్ వారికి హామీ..

ఎగ్జిబిటర్లతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మా సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి గారు హామీ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెరిగినప్పుడు రెంట్‌తో పాటు 7.5 శాతం వాటాను ఇవ్వడానికి అంగీకరించాం. అలాగే పర్సంటేజ్ సమస్యపై పూర్తి స్థాయి పరిష్కారం జూన్ 30లోపు తీసుకువస్తామని చిరంజీవి గారు భరోసా ఇచ్చారు" అని తెలిపారు.

Advertisement