HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్
ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'హను-మాన్'. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది. బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతున్న ఈ సినిమా ఇప్పటికే రూ.200కోట్లను మార్కును దాటి.. రూ.300కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే, బుధవారం 'హను-మాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బుధవారం భేటీ అయ్యారు. హను-మాన్ సినిమా గురించి చిత్ర బృందం యోగి ఆదిత్యనాథ్‌కు వివరించారు. దీంతో చిత్ర బృందాన్ని యూపీ సీఎం అభినందించారు. యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశం అనంతరం ప్రశాంత్ వర్మ వర్మ మాట్లాడుతూ.. యోగి జీని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.