Loading...
Ramba Oorvasi Menaka: ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రంభ ఊర్వశి మేనక'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రంభ ఊర్వశి మేనక'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

Ramba Oorvasi Menaka: ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రంభ ఊర్వశి మేనక'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. తాజాగా ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, వెన్నెల కిషోర్, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

వివరాలు

'రంభ ఊర్వశి మేనక' కథేంటంటే..

మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి(అల్లరి నరేశ్)కుటుంబం తరతరాలుగా 'రంభ ఊర్వశి మేనక' డ్రామా కంపెనీని నిర్వహిస్తుంటుంది.

ఆ కుటుంబం దగ్గర ఒక మేజిక్ బుక్ ఉంటుంది. ఆ పుస్తకంపై సరిగ్గా ముగ్గు వేస్తే.. పైనుంచి రంభ, ఊర్వశి, మేనకలు దిగి వచ్చి తమ కోరికలన్నింటినీ తీర్చేస్తారనేది వారి నమ్మకం.

ఈ మేజిక్ బుక్‌ను నమ్ముకున్న సూరి కుటుంబం చివరకు అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రంభ, ఊర్వశి, మేనక మాత్రం ప్రత్యక్షం కారు. సూరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.

చిన్నప్పటి నుంచే హీరో కావాలనేది అతని కల.అయితే హీరో కావాలనే లక్ష్యానికి తగ్గట్టుగా ఎలాంటి ప్రయత్నాలు చేయడు. పైగా మేజిక్ బుక్ పేరుతో అందరి దగ్గరా అప్పులు చేస్తుంటాడు.

వివరాలు

రంభ, ఊర్వశి, మేనకలు సూరి సమస్యలను తీర్చారా?

అలా సూరి అప్పులు ఊరంతా పెరిగిపోతాయి.

దీంతో అతనికి కష్టాలు చుట్టుముడతాయి. అయినప్పటికీ మేజిక్ బుక్ మాత్రం తెరుచుకోదు. ఇంతలో సూరి తల్లి అనారోగ్యానికి గురై మంచాన పడుతుంది.

ఆమె ప్రాణాలను కాపాడాలంటే లక్షల రూపాయలు అవసరమని వైద్యులు చెబుతారు. తల్లి ప్రాణాలను కాపాడేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సూరి మరోసారి మేజిక్ బుక్‌ను ఆశ్రయిస్తాడు. పుస్తకంపై ముగ్గు వేస్తాడు.

ఈసారి అనూహ్యంగా మేజిక్ బుక్ తెరుచుకుంటుంది. ఆ వెంటనే పైనుంచి రంభ, ఊర్వశి, మేనకలు దిగి వస్తారు.

మరి నిజంగానే రంభ, ఊర్వశి, మేనకలు సూరి కోరికలను తీర్చారా? చివరకు మేజిక్ బుక్ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ADVERTISEMENT