Page Loader
Ranveer Allahbadia: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా,సమయ్ రైనా పై ఫిర్యాదు

Ranveer Allahbadia: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా,సమయ్ రైనా పై ఫిర్యాదు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్ కు చెందిన రణ్‌వీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నారు. 'ఇండియాస్ గాట్ లేటెంట్ షో'లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. "తల్లిదండ్రులు శృంగారం చేస్తున్నప్పుడు చూస్తావా?" అనే ప్రశ్నను ఆయన అడగడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముంబై కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్ వద్ద రణ్‌వీర్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి.

వివరాలు 

అసలేం జరిగింది..? 

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోను సమయ్ రైనా నిర్వహించగా, ఈ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజా, బీర్ బైసెప్స్ హోస్ట్ రణ్‌వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌వీర్ ఓ కంటెస్టెంట్‌ను అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారింది. "మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి జాయిన్ అయ్యి, ఆపై చూడకుండా ఉంటావా?" అని అడగడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. డార్క్ హ్యూమర్ చేసే సమయ్ రైనా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. "రణ్‌వీర్‌కి ఏమైంది?" అని అతను వ్యాఖ్యానించాడు. ఈ షోలో పాల్గొన్న వారు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ, వీడియో వైరల్ కావడంతో రణ్‌వీర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.

వివరాలు 

రణ్‌వీర్‌పై నెటిజన్ల ఆగ్రహం

తల్లిదండ్రుల వ్యక్తిగత సంబంధాల గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు రణ్‌వీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "ఇతను తన పాడ్‌క్యాస్ట్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, కానీ నిజజీవితంలో అలా ఉండడు. ట్రెండింగ్ టాపిక్ కోసం మాత్రమే ఆ విషయాలను ఉపయోగించుకుంటాడు. ఇతనికి ఏ జోక్ చెప్పాలో కూడా తెలియదు," అని ఒకరు వ్యాఖ్యానించారు. రణ్‌వీర్‌తో పాటు ఇతరులపై కేసు రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.

వివరాలు 

దేవేంద్ర ఫడణవీస్ స్పందన

లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా రణ్‌వీర్‌తో పాటు ఇతర కామెడియన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. "ఈ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు చూడలేదు. కొన్నిసార్లు విషయాలను వక్రీకరించి ప్రచారం చేస్తారు. ప్రతి ఒక్కరికీ వాక్స్వాతంత్ర్యం ఉంది, కానీ అది ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలి," అని ఆయన అన్నారు. భారతీయ సమాజానికి కొన్ని నియమాలు ఉన్నాయని, వాటిని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.