LOADING...
Toxic Teaser:'టాక్సిక్' టీజర్‌పై వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న సీబీఎఫ్‌సీ
'టాక్సిక్' టీజర్‌పై వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న సీబీఎఫ్‌సీ

Toxic Teaser:'టాక్సిక్' టీజర్‌పై వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న సీబీఎఫ్‌సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన యశ్ నటించిన 'టాక్సిక్' మూవీ టీజర్ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అశ్లీలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చూపించిన దృశ్యాలపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. వివాదంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) స్పందించింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేసే టీజర్లు లేదా వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది.

Details

సెన్సార్ సర్టిఫికేషన్ వ్యవస్థ పరిధిలోకి రాదు

థియేటర్లలో ప్రదర్శించబడే టీజర్లు, ట్రైలర్లకు మాత్రమే సీబీఎఫ్‌సీ అనుమతి అవసరమని తెలిపింది. 'టాక్సిక్' టీజర్‌ను నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేయడంతో అది సెన్సార్ సర్టిఫికేషన్ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంది. డిజిటల్ ప్లాట్‌ఫాం కావడంతో ఇది తమ అధికార పరిధిలోకి రాదని సెన్సార్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, 'టాక్సిక్' మూవీకి సంబంధించిన ఎలాంటి కంటెంట్ కూడా తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. టీజర్‌లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Details

టీజర్ ను తొలగించాలి

ఈ టీజర్‌ను తొలగించాలని కూడా ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడంతో, దీనిపై సెన్సార్ బోర్డు స్పందించింది. ఇదిలా ఉండగా, శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న 'టాక్సిక్' చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement