నటుడు పోసానికి కరోనా: వరుసగా ఇది మూడవసారి
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా వైరస్ తన కోరలు చాచుతోంది. నెమ్మది నెమ్మదిగా కరోనా బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండడం దురదృష్టకరం.
కరోనా ఖతం అయిపోయిందనుకునే లోపే మళ్ళీ పైకి లేచి తన కోరలను దించుతోంది. తాజాగా తెలుగు సినిమా నటుడు పోసాని కృష్ణమురళి, కరోనా బారిన పడ్డారు.
సినిమా షూటింగ్ కోసం పుణెకి వెళ్ళి వచ్చిన పోసాని, ఒంట్లో నలతగా ఉండడంతో టెస్ట్ చేయించుకున్నాడు. దాంతో కరోనా అని తేలింది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు పోసాని. పోసానికి కరోనా సోకడం ఇది మూడవసారి. గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డారు పోసాని. అప్పుడు కూడా ఆసుపత్రిలో చేరారు.
Details
ఒక్కరోజులోనే 45కేసులు
ప్రస్తుతం పోసాని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇటు సినిమాలు, టీవీ సీరియళ్ళలో కనిపిస్తున్న పోసాని, ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణలో పంజా విప్పుతున్న కరోనా:
గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 10వేల కేసులు దేశంలో నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఏకంగా 45కేసులు నమోదైనట్లు సమాచారం.
అందులోంచి 18కేసులు కేవలం హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, శుభ్రత పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో కరోనా నియమ నిబంధనలు అమలు జరుగుతున్నాయి.