Prabhas Fauzi: ప్రభాస్ 'ఫౌజీ'కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెలలోనే ప్రమోషన్స్ షురూ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. 'సీతారామం' వంటి క్లాసిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన హను రాఘవపూడి.. ఈసారి ప్రభాస్‌తో భారీ యాక్షన్ డ్రామాను రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు 'ఫౌజీ' నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. ఇప్పటివరకు మేకర్స్ కేవలం లుక్ పోస్టర్లను మాత్రమే విడుదల చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉంది
ఈ నేపథ్యంలో 'ఫౌజీ' ప్రమోషన్స్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
అంతేకాదు.. 'ఫౌజీ' నుంచి ఇకపై విడుదల చేయబోయే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
వివరాలు
చివరి దశలో షూటింగ్.. డిసెంబర్ 3న రిలీజ్!
ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. అనుకున్నట్లుగానే డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మిగిలిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం బిజీగా ఉంది.
పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు కేవలం లుక్ పోస్టర్లతోనే ఆసక్తిని పెంచిన 'ఫౌజీ'.. ఈ నెలలో అధికారికంగా ప్రమోషన్స్ ప్రారంభిస్తే మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది.
మరి ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తారో చూడాలి.