
ఏజెంట్ ప్రమోషన్లు మొదలు: అఖిల్ బర్త్ డే సందర్భంగా క్రీజీ పోస్టర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 28వ తేదీన ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ ప్రమోషన్లు మొదలెట్టేసారు. ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఏజెంట్ నుండి క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో యాక్షన్ మోడ్ లో కనిపించాడు అఖిల్.
బిల్డింగ్ మీద నుండి దూకుతున్న అఖిల్ ఫోటోను ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఏజెంట్ మూవీని పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నింపేసారని ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమైపోయింది.
ఏజెంట్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఏజెంట్
ఇప్పుడు వదులుతున్న పోస్టర్లు కూడా ఇది పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని నిరూపిస్తున్నాయి. అఖిల్ తన మొదటి సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్లలో కనిపించాడు.
ఆ తర్వాత అంతకుమించి యాక్షన్ ఎపిసోడ్స్ ని ఏజెంట్ లో చూడబోతున్నామని టీజర్లు, పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సరెండర్ 2 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ థమీజా సంగీతం అందిస్తున్నారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏజెంట్ సినిమా నుండి రిలీజైన పోస్టర్
The celebrations have just begun😎
— AK Entertainments (@AKentsOfficial) April 8, 2023
Here’s a b’day special
ACTION POSTER of #AGENT @AkhilAkkineni8 🔥
WILD ACTION Loading in theatres from APRIL 28th💥#HBDAkhilAkkineni#AGENTonApril28th@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha pic.twitter.com/p6qxJaEs9I