
Dacoit: 'డెకాయిట్' నుంచి క్రేజీ అప్‌డేట్.. స్టన్నింగ్ లుక్ లో మృణాల్-అడవి శేష్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.
శనీల్ డియో దర్శకత్వంతో 'డెకాయిట్' చిత్రంలో నటిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌తో పాటు మృణాల్ ఠాకూర్ లుక్ ఫైనల్ చేస్తూ చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
కొత్తగా విడుదలైన పోస్టర్‌లో మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది.
ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూనే మరో చేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తోంది. ఇదే సమయంలో పక్కనే అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తూ కనిపించాడు.
Details
అడివి శేష్ బర్త్‌డే సందర్భంగా మృణాల్ స్పెషల్ విషెస్
ఈ కొత్త లుక్‌తో పాటు అడివి శేష్ బర్త్‌డే సందర్భంగా మృణాల్ ఠాకూర్ స్పెషల్ విషెస్ అందించింది.
'అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించానంటూ ఆమె పేర్కొనడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కల్కి 2898 ఏ.డీ', 'ఫ్యామిలీ స్టార్' చిత్రాలతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. మరోవైపు, ఆమె ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోస్టు చేసిన మృణాల్
అవును వదిలేసాను..
— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024
కానీ మనస్పూర్తిగా ప్రేమించాను
Happy Birthday, @AdiviSesh ✨
Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe