
ప్రభాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్: షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పెసారు
ఈ వార్తాకథనం ఏంటి
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న కల్కి 2898 ఏడీ, మారుతి దర్శకత్వంలోని మరో సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉండబోతుంది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవుతుందనే విషయంపై అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Details
2024 జూన్ నుండి స్పిరిట్ షూటింగ్ మొదలు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత స్పిరిట్ షూటింగ్ మొదలవనుంది.
2024 జూన్ నుండి స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుకానిందని చిత్ర నిర్మాత బ్రిజ్ భూషణ్ వెల్లడి చేశారు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై అభిమానులు అంచనాలు అధికంగా ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగా సినిమా హీరో అంటే విపరీతమైన యాటిట్యూడ్ తో ఎవరినీ లెక్క చేయని విధంగా కేర్ లెస్ గా ఉంటాడు.
అలాంటి పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.