Page Loader
కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 
కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్

కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 

వ్రాసిన వారు Stalin
May 12, 2023
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య నటించిన 'కస్టడీ' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, కృతి‌శెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ద్విభాషా చిత్రంతో చైతూ తమిళ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. వెంకట్ ప్రభు తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, అంజి ఇండస్ట్రీస్ పతాకాలపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. తమిళంలో పలు యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలను రూపొందించిన అనుభవం ఉన్న వెంకట్ ప్రభు, ఈ మూవీని ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాడు. ప్రేక్షకుడు సినిమా కథను ఊహించినప్పటికీ కథ ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

రివ్యూ

పోలీసు కానిస్టేబుల్ చుట్టూ సినిమా కథ

ఈ సినిమా కథ నాగ చైతన్య పోషించిన శివ అనే పోలీసు కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. రాజు అనే గ్యాంగ్‌స్టర్ కోర్టుకు తీసుకెళ్లేందుకు శివను అధికారులు నియమిస్తారు. ఈ క్రమంలో రాజు ప్రత్యర్థులు అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌స్టర్‌ను హిరో ఎలా కాపాడుతాడనేది సినిమా. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగినట్లు ప్రేక్షకులు ట్వీట్ చేశారు. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా స్క్రీన్ ప్లేను దర్శకుడు పరుగులు పెట్టించాడు. తెరపై నాగ చైతన్య, కృతి శెట్టి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్లస్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్టాఫ్ సూపర్ అంటూ ప్రేక్షకుడు ట్వీట్