LOADING...
Dacoit: డెకాయిట్‌కు భారీ హైప్.. విడుదలకు ముందే రికార్డు బుకింగ్స్
డెకాయిట్‌కు భారీ హైప్.. విడుదలకు ముందే రికార్డు బుకింగ్స్

Dacoit: డెకాయిట్‌కు భారీ హైప్.. విడుదలకు ముందే రికార్డు బుకింగ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా జరగడం ఈ సినిమాపై ఉన్న బజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. విడుదలకు ఒక రోజు ముందే యూఎస్ ప్రీమియర్లతోనే సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటికే 2,20,000 డాలర్లకు పైగా (దాదాపు రూ.1.80 కోట్లు)వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రముఖ టికెటింగ్ యాప్ BookMyShow లో గత 24 గంటల్లోనే సుమారు 30,000 టికెట్లు అమ్ముడవడం విశేషం.

వివరాలు 

యూఎస్ ప్రీమియర్ కి అమ్ముడైన 14,000కు పైగా టికెట్లు 

ఈ స్పందనను చూసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యూఎస్ ప్రీమియర్ల కోసం 14,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో అడవి శేష్ నటించిన మేజర్ సినిమా ప్రీమియర్ కలెక్షన్లను 'డెకాయిట్' దాటేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఓవర్సీస్‌లో మోక్ష మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. దర్శకుడిగా షనీల్ డియో కు ఇది తొలి సినిమా. కథను అడవి శేష్, షనీల్ డియో కలిసి రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు.

వివరాలు 

ట్రైలర్‌ను ప్రశంసించిన బాలీవుడ్ స్టార్

సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ట్రైలర్‌ను ప్రశంసించడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement