Dance Master Pandu: షాకింగ్.. రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు కాళ్లకు తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని లొడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బాలు రైడర్స్ అనే డాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో మంగళవారం రాత్రి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.
వివరాలు
ఈవెంట్ నుంచి వస్తుండగా దారుణం..
ఈవెంట్ పూర్తిచేసుకుని వస్తుండగా దారుణం జరిగింది. లొడగలవాని పాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు వాంతులు అయ్యాయి. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తులు రోడ్డుపైకి దిగారు.అదే సమయంలో కోళ్ల లోడ్‌తో వస్తున్న వాహనం ఒక్కసారిగా వెనుక నుంచి కారును ఢీకొంది. దీంతో కారు వెనకాల భాగంలో నిలబడిన పండు మాస్టర్ తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
వివరాలు
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
మరో కారులో పండు మాస్టర్‌ని విశాఖలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడ చేరుకున్న హైవే సిబ్బంది ఆనందపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వాహనాల రాకపోకలను అదుపు చేశారు. ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు బలంగా గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.