
డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చేసిన ప్రభు కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రముఖి, శక్తి, డార్లింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు ప్రభు, గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కొడంబక్కల్ లోని మెడ్ వే హాస్పిటల్ కు చేర్చారు.
కడుపునొప్పితో విలవిల్లాడిన ప్రభును పరీక్షించిన వైద్యులు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని గుర్తించి సర్జరీ చేసి రాళ్ళను తొలగించారట. ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉందట. చింతించాల్సిన అవసరం లేదని, మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ప్రభు, ఇటీవల వారసుడు తెలుగు అనువాదంతో తెలుగులో కనిపించారు. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చేసారు ప్రభు. అ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డార్లింగ్ యాక్టర్ ప్రభు కు తీవ్ర అస్వస్థత
Actor #Prabhu was admitted to hospital on 20th night with a severe stomach pain ;
— RIAZ K AHMED (@RIAZtheboss) February 22, 2023
"stones were detected , went in for a laser endoscopy surgery… all went well , should be out in a day or two … with all your love 👍💪💐"
Get well soon Sir @iamVikramPrabhu @idiamondbabu pic.twitter.com/IuhoG5jMFD