Loading...
OG :'ఓజీ' టీవీ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్.. 'OG 2'పై కూడా బిగ్ అప్‌డేట్!
ఓజీ' టీవీ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్.. 'OG 2'పై కూడా బిగ్ అప్‌డేట్!

OG :'ఓజీ' టీవీ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్.. 'OG 2'పై కూడా బిగ్ అప్‌డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)' విడుదలై దాదాపు పది నెలలు గడిచినా.. ఆ సినిమాపై అభిమానుల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం.. టెలివిజన్ వరల్డ్ ప్రీమియర్‌తో పాటు 'OG 2' సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం.

వివరాలు

ఈటీవీలో 'ఓజీ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

ఇప్పటివరకు 'ఓజీ' శాటిలైట్ హక్కులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ప్రముఖ తెలుగు ఛానెల్ 'ఈటీవీ' ఈ సినిమా టెలివిజన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఛానెల్‌లో ప్రత్యేక ప్రోమోలు ప్రసారం అవుతుండగా, ఆగస్టులో వచ్చే ఓ ప్రముఖ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

దీంతో బుల్లితెరపై 'ఓజీ'ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

'OG 2'పై ప్రారంభమైన చర్చలు

ఇక అభిమానులను మరింత ఉత్సాహపరిచే విషయం ఏమిటంటే.. 'OG 2' తెరకెక్కించే దిశగా అధికారిక చర్చలు ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ సీక్వెల్‌ను రూపొందించాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.

మొదటి భాగం ముగిసిన విధానం కూడా రెండో భాగానికి మంచి అవకాశం కల్పించడంతో, కథ అభివృద్ధిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

పవన్ సొంత బ్యానర్‌లో నిర్మాణం?

ఈసారి 'OG 2'ను పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్‌పై నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

దర్శకుడు సుజీత్ మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని, సంగీత దర్శకుడు ఎస్. థమన్ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొదటి భాగానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

వివరాలు

త్వరలో అధికారిక ప్రకటన?

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వంటి అంశాలపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

'ఓజీ' సాధించిన ఘన విజయంతో రెండో భాగంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.

అందుకు తగ్గట్టుగానే 'OG 2'ను మరింత గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం అయితే టీవీ ప్రీమియర్, సీక్వెల్ వార్తలు పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ADVERTISEMENT