Loading...
David reddy: రామోజీ ఫిల్మ్ సిటీలో 'డేవిడ్ రెడ్డి' యాక్షన్
రామోజీ ఫిల్మ్ సిటీలో 'డేవిడ్ రెడ్డి' యాక్షన్

David reddy: రామోజీ ఫిల్మ్ సిటీలో 'డేవిడ్ రెడ్డి' యాక్షన్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

కథానాయకుడు మంచు మనోజ్‌ త్వరలో 'డేవిడ్ రెడ్డి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ మోటుకూరి, వెంకట్ రెడ్డి నల్ల గంగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరియా ర్యాబోషాప్కా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ షెడ్యూల్‌లో భాగంగా బాలీవుడ్ నటి సౌండస్ మౌఫకీర్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శ్రష్ఠి వర్మ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.

వివరాలు

సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అదే..

మరోవైపు మంచు మనోజ్‌, సముద్రఖని, రమ్యకృష్ణలపై కీలకమైన క్లైమాక్స్ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ పోరాట సన్నివేశం చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

అలాగే ప్రత్యేక గీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొంది.

1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగే ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వివరాలు

శక్తిమంతమైన యోధుడి పాత్రలో మనోజ్..

ఇందులో మంచు మనోజ్ శక్తిమంతమైన యోధుడి పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సుప్రీమ్ సుందర్, వింగ్ చున్ అంజి ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తాళ్లూరి కృష్ణ మోహన్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తుండగా.. వేణు ఆచార్య సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

ADVERTISEMENT