LOADING...
Adivi Sesh: యాక్షన్, ఎమోషన్‌ సీన్లతో 'డెకాయిట్' ట్రైలర్ వచ్చేసింది

Adivi Sesh: యాక్షన్, ఎమోషన్‌ సీన్లతో 'డెకాయిట్' ట్రైలర్ వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అడవి శేష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ చిత్రం డెకాయిట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, అది మంచి స్పందన పొందుతోంది. ట్రైలర్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటన ప్రత్యేకంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. హరి, జూలియట్ పాత్రల్లో ఇద్దరూ పూర్తిగా ఒదిగిపోయి, భావోద్వేగాలతో పాటు యాక్షన్ మిశ్రమాన్ని సమర్థంగా చూపించారు. సంభాషణలు కూడా ఆసక్తికరంగా ఉండి కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement