Loading...
Sandeep reddy Vanga: 'స్పిరిట్‌'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు
'స్పిరిట్‌'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు

Sandeep reddy Vanga: 'స్పిరిట్‌'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్‌' సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. దీపిక రెమ్యునరేషన్, పని గంటలతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా అడిగారని ఆయన ఆరోపించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. దీపికా పదుకొణె సినిమా లాభాల్లో 10 శాతం వాటా కోరారని తెలిపారు. ఆమె ఎలాంటి డిమాండ్ అయినా చేయవచ్చని, అయితే అది సినిమా బడ్జెట్‌కు అనుగుణంగా ఉండాలని అన్నారు. ఆర్థికంగా లెక్కలు సరిపోకపోవడంతో ఇతర ఆప్షన్ల కోసం వెతకాల్సి వచ్చిందని చెప్పారు.

వివరాలు

దాదాపు 18 నెలల పాటు చర్చ..

దీపికతో సందీప్ రెడ్డి వంగా దాదాపు 18 నెలల పాటు చర్చలు జరిపారని ప్రణయ్ తెలిపారు.

సినిమా కథ, ఆమె చేయాల్సిన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా ఆమెతో చర్చించినట్లు చెప్పారు.

అయితే తమ మధ్య జరిగిన అంతర్గత చర్చలు బయటకు వెళ్లడంతో తాము అసంతృప్తికి గురయ్యామని ప్రణయ్ ఆరోపించారు.

దీపికను సినిమా నుంచి మార్చడానికి ప్రధాన కారణాల్లో రెమ్యునరేషన్, పని వేళలు ఉన్నాయని ప్రణయ్ వెల్లడించారు.

ఇది కేవలం అదనంగా రూ.5-6 కోట్లు అడిగిన వ్యవహారం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదం నడుస్తున్న సమయంలో సందీప్ రెడ్డి వంగా కూడా 'ఎక్స్‌'లో ఓ పోస్ట్ చేశారు.

వివరాలు

వివరాలు బయటకు వెల్లడించడం సరికాదు..

ఓ నటి పేరును ప్రస్తావించకుండా.. కథను నమ్మకంతో చెప్పిన తర్వాత ఆ వివరాలను బయటకు వెల్లడించడం సరికాదని అన్నారు.

తన కథను బయటకు చెప్పడం, ఓ యువ నటిని కించపరిచేలా వ్యవహరించడం వంటి చర్యలను ఆయన ప్రశ్నించారు.

"ఇదేనా మీ ఫెమినిజం?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపికా రోజుకు 8గంటలు మాత్రమే పనిచేస్తానని కోరినట్లు వార్తలు వచ్చాయి.

మహిళా నటిగా మాత్రమే కాకుండా చాలా మంది పురుష నటులు కూడా ఏళ్లుగా 8 గంటల షిఫ్ట్‌లోనే పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్‌' సినిమా 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT