LOADING...
Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక
ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక

Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆమె భారత దేశంలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపికై, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ముందున్నారు. దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ కూడా గర్వంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆమె తెలిపారు. కొన్ని రోజులుగా సినిమాల వర్క్ లైఫ్, రెమ్యునరేషన్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో కొన్ని చర్చల్లో భాగంగా స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి ఆమె బయటపడిన సంగతి తెలిసిందే.

Details

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యం

ఈ ఏడాది అక్టోబర్ 10న జరగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day) సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త ఇనిషియేటివ్‌ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా మెంటల్ హెల్త్ కేర్ అందరికీ అందేలా చేస్తూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీపిక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై, మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ఆసక్తి చూపించారు. దీపిక తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మంత్రితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసి, ఈ గౌరవాన్ని అభిమానులతో పంచుకున్నారు.