Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. 'దేవరాయ' ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవరాయ' నుంచి కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం" అంటూ 'దేవరాయ' సినిమాను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
వివరాలు
గ్లింప్స్ రిలీజ్..
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.
వివరాలు
సుదీప్ కెరీర్‌లోనే ప్రత్యేకం..
ఇప్పటివరకు మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సుదీప్.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.