Devil Review : డెవిల్ మూవీ రివ్యూ.. యాక్షన్ థ్రిలర్‌తో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడా?
గతేడాది 'బింబిసార'తో హిట్ కొట్టి ఈ ఏడాది 'అమిగోస్'తో ఫ్లాప్ ను మూటకట్టుకొని, మళ్లీ ఇదే ఏడాది 'డెవిల్' (Devil) సినిమాతో కళ్యాణ్ రామ్ ముందుకొచ్చాడు. ఈ మూవీలో సంయుక్త మీనన్ కథనాయికగా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ మూవీ రివ్యూ (Movie Review) ఎలా ఉందో తెలుసుకుందాం. 1940లో సుభాష్ చంద్రబోస్‌ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుంది. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం సీక్రెట్ ఏజెంట్‌గా డేవిడ్ (కళ్యాణ్ రామ్) ప్రయత్నిస్తుంటాడు. రసపురంలోని జమిందార్ ఇంట్లో జరిగిన ఓ హత్య కేసుని చేధించడానికి ప్రభుత్వం డెవిల్ ను పంపుతుంది.
యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన కళ్యాణ్ రామ్
ఈ క్రమంలో సుబాష్ చంద్రబోస్ ఏజెంట్లగా పనిచేసే త్రివర్ణను డెవిల్ గుర్తిసాడు. జమిందార్ ఇంట్లో హత్య కేసు? మరోవైపు త్రివర్ణ ఎవరు? బోస్ ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుందా తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలవరీలు బాగున్నాయి. ఇక ఇంటర్వెల్ తర్వాాత టిస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆసక్తిని పెంచుతాయి. BGM బాగున్నా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. ఎమోషన్స్ ను కూడా డైరక్టర్ పెద్దగా హ్యాండిల్ చేయలేకపోయారు. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా పెట్టకుండా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది.