
దసరా సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సరికొత్త వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం
ఈ వార్తాకథనం ఏంటి
తన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త కంటెంట్ ని అందించే ఆహా ఫ్లాట్ ఫామ్ దసరా సందర్భంగా సరికొత్త భక్తి రస వెబ్ సిరీస్ ని తీసుకువస్తుంది.
సర్వం శక్తిమయం అనే టైటిల్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కథ, అష్టాదశ శక్తిపీఠాల నేపథ్యంలో సాగనుంది.
దేవుడిని నమ్మని ఒకానొక నాస్తికుడు అష్టాదశ శక్తి పీఠాల దర్శనానికి ఎందుకు బయలుదేరాడు? ఆ తర్వాత దేవుడిని నమ్మే ఆస్తికుడిగా ఎలా మారాడన్నది ఈ సిరీస్ లో చూపించబోతున్నారు.
దసరా నవరాత్రుల సందర్భంగా సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ ని అక్టోబర్ 20వ తేదీ నుండి ఆహాలో అందుబాటులో ఉంచనున్నారు.
Details
బీవీఎస్ రవి అందించిన కథ
ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి సర్వం శక్తిమయం సిరీస్ కు కథను అందించారు.
ఈ సిరీస్ లో హీరోయిన్ ప్రియమణి, సుబ్బరాజు, సంజయ్ సూరి ప్రధాన పాత్రలను పోషించారు. విజయ్, అంకిత్, కౌముది నిర్మాతలుగా నిర్మించిన ఈ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు.
సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న 18 శక్తి పీఠాలను దర్శనం చేసుకోవచ్చని చిత్ర బృందం తెలియజేస్తోంది. శ్రీలంకలో ఉన్న శక్తిపీఠం కూడా ఈ సిరీస్ లో కనిపించనుందని సమాచారం.
మొత్తానికి పండగ సందర్భంగా సరికొత్త వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుందన్నమాట.