Page Loader
ధమాకా దర్శకుడికి అదిరిపోయే అవకాశం, ఈ సారి ఏకంగా స్టార్ హీరోతో అవకాశం
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు

ధమాకా దర్శకుడికి అదిరిపోయే అవకాశం, ఈ సారి ఏకంగా స్టార్ హీరోతో అవకాశం

వ్రాసిన వారు Sriram Pranateja
Jan 09, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ నటించిన ధమాకా సినిమా తెలుగు వెండితెర మీద వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వందకోట్ల మార్కును దాటేసి రవితేజ కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. ధమాకా సినిమా విజయం వెనక రవితేజ మాస్ మాంత్రం ఉంది. ఆ మంత్రాన్ని సరిగ్గా వినియోగించుకున్నాడు దర్శకుడు త్రినాథ రావు నక్కిన. నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే వంటి వినోదాత్మకమైన సినిమాలు అందించిన త్రినాథ రావుకు ధమాకాతో పెద్ద విజయం దక్కింది. దీంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థలు త్రినాథ రావు కోసం ఎగబడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్, త్రినాథ రావుతో సినిమా ప్లాన్ చేస్తుందని వినిపిస్తోంది.

ధమాకా

విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేయబోతున్న ధమాకా డైరెక్టర్

ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారని, త్రినాథ రావు నెక్స్ట్ సినిమా మైత్రీ బ్యానర్ లోనే ఉంటుందని అనుకుంటున్నారు. అది కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే విధంగా వినోదాత్మకంగా కథని రెడీ చేసాడట త్రినాథ రావు. పరిస్థితులు అనుకూలిస్తే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ధమాకా సినిమాతో దర్శకుడు త్రినాథ రావుకు ధమాకా ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవాలి. త్రినాథ రావు దర్శకత్వం వహించిన ధమాకా సినిమాను పీపుల్స్ మీడీయా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించింది.