Hema malini: ధర్మేంద్రే నా బలం, నా జీవితం.. భర్తను తలుచుకుని హేమమాలిని భావోద్వేగం!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నటి హేమమాలిని భర్త ధర్మేంద్ర ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం తన జీవితంలో భరించలేని లోటని హేమమాలిని భావోద్వేగభరితంగా పేర్కొన్నారు. ధర్మేంద్రతో కలిసి దిగిన అనేక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హేమమాలిని తన పోస్టులో ఇలా పేర్కొన్నారు. నా జీవితంలో అన్నీ ధర్మేంద్రనే. భార్యను అపారంగా ప్రేమించే భర్త, పిల్లలను బాధ్యతగా చూసుకునే తండ్రి, మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు, అద్భుతమైన కవి... ఇలా ఎన్నో రూపాల్లో ఆయన నా జీవితంలో ఉన్నారు. నా కష్టసుఖాల్లో నన్ను అండగా నిలిచాడు. కుటుంబమే తనకు ప్రథమమైనది అన్న భావనతో జీవించాడు.
Details
ధర్మేంద్ర లేని లోటు ఎప్పటికీ నిండదు
ఒక నటుడిగా ఆయన చూపిన ప్రతిభ ఆయనను లెజెండ్‌గా నిలబెట్టింది. ఆయన కీర్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. అలాగే, వ్యక్తిగతంగా తనకు ధర్మేంద్ర లేని లోటు ఎప్పటికీ నిండదని, ఆ బాధను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని అన్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అనేక అమూల్యమైన జ్ఞాపకాలను నాకు అందించారంటూ ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. హేమమాలిని కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలను కూడా ఆ పోస్ట్‌లో పంచుకున్నారు.