
ఎల్ జీ ఎమ్ రివ్యూ: వెండితెర మీద టీవీ సీరియల్
ఈ వార్తాకథనం ఏంటి
నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు
దర్శకత్వం: రమేష్ తమిళమణి
నిర్మాణం: ధోనీ ఎంటర్ టైన్మెంట్స్
తమిళంలో జులై 28న రిలీజైన LGM(లెట్స్ గెట్ మ్యారీడ్), తెలుగులో ఈరోజు రిలీజైంది.
కథ:
ఒకే కంపెనీలో పనిచేస్తున్న గౌతమ్(హరీష్ కళ్యాణ్), మీరా(ఇవానా) ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లి లీలా(నదియా)కు చెబుతాడు గౌతమ్. కొడుక్కి పెళ్ళి చేయాలన్న ఆశతో ఉన్న తల్లి పెళ్ళికి ఒప్పుకుంటుంది.
అయితే పెళ్ళి చేసుకుంటే వేరే కాపురం పెట్టాలని మీరా కండీషన్ పెడుతుంది. అలాగే తనకు కాబోయే అత్తగారు ఎలాంటిదో తెలుసుకోవడానికి ట్రిప్ ప్లాన్ చేస్తుంది మీరా.
ఈ ట్రిప్ లో ఏం జరుగుతుంది? కాబోయే అత్తాకోడళ్ల మధ్య కొడుకు ఎలా నలిగిపోతాడనేదే కథ.
Details
సినిమా ఎలా ఉందంటే?
ఎల్ జీ ఎమ్ చాలా సింపుల్ కథ. టీవీ సీరియల్స్ లో కనిపించే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఈ సినిమాలో కనిపిస్తాయి. కాకపోతే వెండితెర మీద చూసేటపుడు ఆ సీన్లన్ని బోరింగ్ గా అనిపిస్తాయి.
కథ అందరికీ తెలిసినదే కాబట్టి కథనం కొత్తగా ఉండాలి. కాకపోతే ఎల్ జీ ఎమ్ లో కథనం వేగంగా నడవదు. నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.
సెకండాఫ్ లో హీరో పాత్ర పెద్దగా లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టూ తిరుగుతుంది కాబట్టి అలా అనిపించడం సహజమే.
Details
ఎవరెలా చేసారంటే?
హరీష్ కళ్యాణ్, ఇవానా తమ పాత్రల పరిధి మేరకు నటించారు కానీ సినిమాలో పెద్దగా విషయం లేకపోవడంతో ఆ పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.
నదియా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ కొన్నిచోట్ల వర్కౌట్ కాలేదు.
ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నప్పటికీ కథ, కథనాలు బలహీనంగా ఉండటం ఎల్ జీ ఎమ్ సినిమాకు మైనస్ గా మారింది.
ఓవరాల్ గా చూసుకుంటే కథ, కథనాలు మరింత బాగుంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది.