LOADING...
Dhurandhar: సినిమా కథకు మేజర్‌ మోహిత్‌ శర్మ జీవితానికి సంబంధం లేదు.. 'ధురంధర్'కు CBFC అనుమతి
'ధురంధర్'కు CBFC అనుమతి

Dhurandhar: సినిమా కథకు మేజర్‌ మోహిత్‌ శర్మ జీవితానికి సంబంధం లేదు.. 'ధురంధర్'కు CBFC అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్‌' సినిమా కథకు అమర వీరుడు మేజర్‌ మోహిత్‌ శర్మ జీవితంతో ఎలాంటి సంబంధం లేదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) స్పష్టమైన ప్రకటన చేసింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని తాజాగా మరోసారి పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేసింది. తమ కుమారుడు మేజర్‌ మోహిత్‌ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని అనుమతి లేకుండానే 'ధురంధర్‌' సినిమా తీశారని ఆరోపిస్తూ ఆయన తల్లిదండ్రులు కొద్దికాలం క్రితం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

వివరాలు 

మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోనూ సినిమాపై ప్రచారం

సినిమా మొత్తం మేజర్‌ జీవితం మీదే నిర్మితమైందన్న ప్రచారం మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోనూ విస్తృతంగా సాగుతుండగా, దీనిపై చిత్ర బృందం తమతో మాట్లాడలేదని, వివరణ కూడా ఇవ్వలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సినిమాను విడుదల చేసే ముందు తమకు ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పించాలని, అప్పటివరకు మూవీ రిలీజ్‌ను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని వారు అభ్యర్థించారు.

Advertisement