Kriti Sanon: రాఖీ పండుగను అవమానించిందా? కృతి సనన్ యాడ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జువెల్లరీ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ ఆభరణాల బ్రాండ్ GIVA రక్షాబంధన్ సందర్భంగా రూపొందించిన 'ఫరెవర్ సిబ్లింగ్' ప్రచార చిత్రంలో కృతి నటించారు. అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు, ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
దుస్తులపై అభ్యంతరాలు..
ఈ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్-వైట్ రంగు బ్రాలెట్ తరహా బ్లౌజ్, డ్రేప్డ్ స్కర్ట్, కేప్ ధరించి కనిపించారు.
రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనలో ఆమె సంప్రదాయ దుస్తులు కాకుండా గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో కనిపించడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇది పండుగ ప్రాముఖ్యతను తగ్గించేలా ఉందని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నమంటూ విమర్శలు చేస్తున్నారు.
వివరాలు
పెంపుడు కుక్కకు రాఖీ.. అదే అసలు వివాదం!
అయితే, ఈ యాడ్‌పై ఎక్కువ చర్చకు కారణమైన అంశం దాని కాన్సెప్ట్. ప్రకటనలో కృతి తన సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత తన పెంపుడు కుక్కకు కూడా రాఖీ కడుతుంది.
ఈ సన్నివేశంపై కొందరు తీవ్రంగా స్పందిస్తూ.. హిందూ సంప్రదాయాలు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తున్నారు.
పూజా థాలీ వంటి పవిత్రమైన వస్తువులను ఉపయోగిస్తూ పెంపుడు జంతువుకు రాఖీ కట్టడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
కృతికి మద్దతుగా మరో వర్గం
మరోవైపు కృతి సనన్, యాడ్ కాన్సెప్ట్‌కు మద్దతుగా కూడా పలువురు స్పందిస్తున్నారు.
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావించడంలో తప్పేమీ లేదని, ఆధునిక కుటుంబాల్లో పెంపుడు జంతువులతో ఉండే ప్రేమ, అనుబంధాన్నే ఈ ప్రకటన చూపించిందని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు.
అలాగే, ఒక మహిళ ధరించే దుస్తులను బట్టి ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని మరికొందరు కృతికి మద్దతుగా నిలుస్తున్నారు.
మొత్తంగా ఈ యాడ్ నేపథ్యంలో సంప్రదాయం వర్సెస్ ఆధునికత అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.