Netflix: షూటింగ్ మొదలుకాకముందే డిజిటల్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో 'హైకూ'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిన నెట్‌ఫ్లిక్స్.. విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రూపొందించడమే కాకుండా, భారీ కథలు-బడ్జెట్‌లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల డిజిటల్ హక్కులను కూడా ముందుగానే సొంతం చేసుకుంటూ వస్తోంది. తాజాగా అదే జాబితాలో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'హైకూ' చేరింది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషంగా మారింది. సాధారణంగా థియేటర్లలో విడుదలై, రన్ ఎలా ఉందో చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ డీల్‌పై నిర్ణయం తీసుకుంటాయి. అయితే 'హైకూ' విషయంలో విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
Details
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన రామ్
ముఖ్యంగా షూటింగ్ మొదలైన రోజే ఈ డీల్ ఖరారవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తమిళ చిత్రం 'హైకూ' షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తుండగా, విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. 'జో' వంటి సూపర్ హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హరిహరన్ రామ్ ఈ సినిమాకు అదనపు స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం.
Details
షూటింగ్ ప్రారంభమైన తొలి రోజే డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్
నటీనటుల విషయానికి వస్తే.. 'జో', 'కోళి పన్నై చెల్లదురై' చిత్రాలతో గుర్తింపు పొందిన ఏగన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన 'మిన్నల్ మురళి', 'శేషం మైకిల్ ఫాతిమా' వంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న ఫెమినా జార్జ్, అలాగే 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి అప్పళ్ల కథానాయికలుగా కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన తొలి రోజే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం చూస్తే, 'హైకూ' కంటెంట్‌పై ఆ సంస్థ ఎంతటి విశ్వాసం పెట్టిందో అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.