Page Loader
అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే? 
రాజావారు రాణీగారు దర్శకుడితో దిల్ రాజు కొత్త సినిమా

అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 25, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన రాజావారు, రాణీగారు సినిమా దర్శకుడితో ఈ సినిమా ఉండనుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. రాజావారు రాణీగారు సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవి కిరణ్ కోలా దర్శకుడితో తమ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు. ఏ జోనర్ లో సినిమా రూపొందుతుందనేది కూడా తెలియజేయలేదు. రాజావారు రాణీగారు వంటి ప్రేమ కథా చిత్రంతో ఆకట్టుకున్న రవి కిరణ్ కోలా, ఈసారి ఎలాంటి కథను తీసుకువస్తున్నాడో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ ట్వీట్