
శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం?
ఈ వార్తాకథనం ఏంటి
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద అతిపెద్ద అపజయంగా నిలిచింది. సమంత కెరీర్లోనే సూపర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
తాజాగా శాకుంతలం సినిమా నిర్మాత దిల్ రాజు, శాకుంతలం సినిమాతో తనకు తీవ్రంగా నష్టం జరిగిందని పేర్కొన్నాడు.
థియేటర్ల వద్ద శాకుంతలం ఫెయిల్ కావడంతో 22కోట్లు నష్టపోయినట్లు దిల్ రాజు తెలియజేసారు.
ఈ మధ్య తన డిస్ట్రిబ్యూషన్ నుండి విడుదలైన దసరా, బలగం సినిమాలతో సంపాదించినదంతా శాకుంతలంతో పోయిందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
65కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమా, కనీస కలెక్షన్లను కూడా పొందలేక పోయింది. శాకుంతం డిజిటల్ హక్కులు 35కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
Details
త్రీడీలోనూ తెరమీదకు వచ్చిన శాకుంతలం
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం మహాకావ్యాన్ని శాకుంతలం పేరుతో వెండితెర మీదకు తీసుకొచ్చారు దర్శకుడు గుణశేఖర్.
ఈ చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేసారు. కానీ అటు 2డీకి గానీ, త్రీడీకి గానీ సరైన స్పందన రాలేదు.
శాకుంతలం సినిమా ఫెయిల్ అవడానికి కారణాలు:
శాకుంతలం కథనం బలహీనంగా ఉండడమే, ఆ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణమని అన్నారు. అలాగే సమంత సొంత డబ్బింగ్ పై విమర్శలు వచ్చాయి. ఇంకా హీరోగా కనిపించిన దేవ్ మోహన్, సరైన నటన కనబర్చలేదని కామెంట్లు వచ్చాయి.
గ్రాఫిక్స్ సరిగ్గా లేవని, వెండితెర మీద కనిపించిన యాక్షన్ సీక్వెన్సులు తేలిపోయాయాని అన్నారు.