Bhogi: 'భోగి'లో మందారంగా డింపుల్ హయతి.. బోల్డ్ లుక్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా మూవీ యూనిట్ హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె 'మందారం' అనే పాత్రలో కనిపించనుంది. "ప్రపంచం కోరుకున్న అందం.. కానీ ఆ ఆత్మను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు" అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ఎర్ర చీరలో కనిపించిన డింపుల్ హయతి పవర్‌ఫుల్, బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. చేతిలో విసనకర్ర పట్టుకుని తీక్షణంగా చూస్తున్న ఆమె రూపం, 1960ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు.
వివరాలు
ఆగస్టు 28న రిలీజ్
ఆమె పాత్ర ఎంతో శక్తివంతంగా, ఎవరినీ లెక్కచేయని స్వభావంతో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆమె 'కందుల సులోచనా రాణి' అనే పాత్రలో మోదుగ ఆకులతో బుట్టలు అల్లే పల్లెటూరి యువతిగా కనిపించింది. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ 'గంగ' అనే పాత్రలో నటిస్తున్నాడు. 1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. 'భోగి' సినిమాను ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.