RAPO 23 : డైరెక్షన్ చేస్తూనే 24 గంటల షూటింగ్.. రామ్ పోతినేని డెడికేషన్‌కు ఫిదా!
ఈ వార్తాకథనం ఏంటి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #RAPO23. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటుడిగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తున్న రామ్ పోతినేని.. ఏకంగా 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. పాండిచ్చేరి శివార్లలో ఏర్పాటు చేసిన భారీ సెటప్‌లో ఈ కీలక షెడ్యూల్ దాదాపు 9 రోజుల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రామ్ ఒకవైపు నటుడిగా కెమెరా ముందు తన పాత్రను పోషిస్తూనే.. మరోవైపు దర్శకుడిగా షూటింగ్ బాధ్యతలను పర్యవేక్షించారు.
వివరాలు
ఇటీవల భారీ వర్షాలతో షూటింగ్ కు స్వల్ప అంతరాయం
ఈ క్రమంలోనే 24 గంటల పాటు నిర్విరామంగా చిత్రీకరణ జరిపి తన డెడికేషన్‌తో చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచారు.
అయితే పాండిచ్చేరిలో కురిసిన భారీ వర్షాలు షూటింగ్‌కు స్వల్ప అంతరాయం కలిగించాయి. దీంతో ప్రస్తుత షెడ్యూల్‌ను తాత్కాలికంగా ముగించి చిత్ర బృందం తిరిగి వెళ్లినట్లు సమాచారం.
మిగిలిన కీలక సన్నివేశాలను పూర్తి చేసేందుకు యూనిట్ త్వరలోనే మరోసారి పాండిచ్చేరికి వెళ్లనుంది.
ఇప్పటికే పాండిచ్చేరి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రణాళిక రూపొందించారు.
ఈ షెడ్యూల్ కోసం తొలుత 15 రోజుల షూటింగ్‌ను ప్లాన్ చేసినట్లు గతంలో చిత్ర బృందం వెల్లడించింది.
రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో '#RAPO23'పై ఆసక్తి నెలకొంది.