
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు శంకర్ ఇటు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను, అటు తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
తాజాగా గేమ్ ఛేంజర్ గురించి అప్డేట్ ఇచ్చాడు శంకర్.
పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిందని, రేపటినుండి ఇండియన్ 2 షూటింగ్లో పాల్గొనాలని తన సోషల్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
ఈ రెండు సినిమాలు, ఈ సంవత్సరం చివర్లో, లేదా వచ్చే సంవత్సరం మొదట్లో రిలీజ్ అవుతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై అప్డేట్ ఇచ్చిన శంకర్
Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet
— Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023