Page Loader
Disha patani: ప్రభాస్‌తో రెండోసారి జోడీ కట్టనున్న దిశా పటానీ.. అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. 
ప్రభాస్‌తో రెండోసారి జోడీ కట్టనున్న దిశా పటానీ.. అదృష్టం అంటే ఈ అమ్మడిదే..

Disha patani: ప్రభాస్‌తో రెండోసారి జోడీ కట్టనున్న దిశా పటానీ.. అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కల్కి 2898 AD' చిత్రంలో కథానాయకుడు ప్రభాస్‌కు జోడీగా కనిపించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది బాలీవుడ్‌ నటి దిశా పటానీ. తాజాగా,ఈ ఇద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశమున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికల పాత్రలుండగా, ఇప్పటికే ఓ పాత్ర కోసం ఇమాన్వీని ఎంపిక చేశారు.

వివరాలు 

'కల్కి 2898ఏడీ' సీక్వెల్‌లోనూ..

ఇక రెండో కథానాయిక పాత్ర కోసం దిశా పటానీ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, ప్రభాస్‌ - దిశా పటానీ కలిసి నటించే రెండో చిత్రం ఇదిగా మారనుంది. అంతేకాక, ఈ సినిమా తర్వాత వీరిద్దరూ 'కల్కి 2898ఏడీ' సీక్వెల్‌లోనూ కలిసి సందడి చేసే అవకాశముంది.