Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. 2026 నుంచి 2028 వరకు రాబోయే సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
డిస్నీ అభిమానులకు రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఇటీవల నిర్వహించిన D23 అల్టిమేట్ ఫ్యాన్ ఈవెంట్ వేదికగా డిస్నీ సంస్థ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అధికారికంగా ప్రకటించింది. వీటిలో కొన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మరికొన్ని 2027, 2028లో విడుదల కానున్నాయి. పాత క్లాసిక్ చిత్రాలకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులతో పాటు మార్వెల్, స్టార్ వార్స్ వంటి ప్రముఖ ఫ్రాంచైజీలకు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు ఇవే..
వివరాలు
లిలో & స్టిచ్ 2..
'లిలో & స్టిచ్ 2' పేరు వినగానే 2005లో వచ్చిన యానిమేషన్ చిత్రం 'లిలో & స్టిచ్: స్టిచ్ హాస్ ఎ గ్లిచ్' గుర్తుకు రావచ్చు.
ఆ సినిమాలో స్టిచ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో పాటు తన కుటుంబాన్ని లిలో ఎలా రక్షించుకుందనే అంశం ప్రధానంగా ఉంటుంది.
D23 ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టును అధికారికంగా వెల్లడించిన సంస్థ.. 2028 మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈసారి సరికొత్త కథతో సినిమా రూపొందనుంది. ఒరిజినల్ మేకర్ క్రిస్ సాండర్స్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ చిత్రంలో స్టిచ్‌కు జోడీగా ఉండే పింక్ కలర్ ఏలియన్ క్యారెక్టర్ 'ఏంజెల్' (Angel)ను పరిచయం చేయనున్నారు. ఇది ఎక్స్‌పెరిమెంట్ 624గా గుర్తింపు పొందిన పాత్ర.
వివరాలు
టాంగిల్డ్.. లైవ్ యాక్షన్‌లోకి!
డిస్నీ క్లాసిక్ యానిమేషన్ చిత్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన 'టాంగిల్డ్' (Tangled) ఇప్పుడు లైవ్-యాక్షన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
D23 ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ సినిమా 2028 మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 'ది గ్రేటెస్ట్ షోమ్యాన్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మైఖేల్ గ్రేసీ ఈ లైవ్-యాక్షన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
రాపుంజెల్ పాత్రలో ఆస్ట్రేలియన్ నటి టీగన్ క్రాఫ్ట్ కనిపించనుండగా.. ఫ్లిన్ రైడర్‌గా మిలో మాన్‌హీమ్ నటిస్తున్నారు.
ఇక ఈ కథలో కీలకమైన విలన్ మదర్ గోథెల్ పాత్రను కాథరిన్ హాన్ పోషిస్తున్నారు.
స్పెయిన్, యూకే ప్రాంతాల్లోని చారిత్రాత్మక కట్టడాలు, అందమైన లొకేషన్లను చిత్రీకరణ కోసం ఉపయోగిస్తున్నారు.
వివరాలు
ఓస్వాల్డ్..
డిస్నీ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పాత్రల్లో 'ఓస్వాల్డ్ ది లక్కీ రాబిట్' ఒకటి.
ఈ పాత్రను వాల్ట్ డిస్నీ, ఉబ్ ఐవర్క్స్ కలిసి 1927లో రూపొందించారు.
మిక్కీ మౌస్‌కు ముందే ప్రేక్షకులకు పరిచయమైన ఈ నల్లటి కుందేలు పాత్ర డిస్నీ యానిమేషన్ చరిత్రలో కీలకమైన మైలురాయిగా నిలిచింది.
ఇప్పుడు అదే ఓస్వాల్డ్ పాత్రను మరోసారి తెరపైకి తీసుకురానుంది డిస్నీ.
ఈసారి దీన్ని మూడు ఎపిసోడ్లతో కూడిన చిన్న సిరీస్‌గా రూపొందిస్తున్నారు.
ఈ మినీ సిరీస్ 2027 ఫిబ్రవరిలో డిస్నీ+ వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది.
వివరాలు
విజన్ క్వెస్ట్..
మార్వెల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'విజన్ క్వెస్ట్' కూడా ఒకటి. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో భాగంగా రూపొందుతున్న కొత్త వెబ్ సిరీస్.
D23 ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. మొత్తం 8 ఎపిసోడ్లతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
2026 అక్టోబర్ 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో మార్వెల్ అభిమానులకు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
D23 అల్టిమేట్ ఫ్యాన్ ఈవెంట్‌లో డిస్నీ ప్రకటించిన ఈ ప్రాజెక్టులు 2026 నుంచి 2028 వరకు అభిమానులకు వరుస వినోదాన్ని అందించనున్నాయి.