LOADING...
Vishwak Sen: ఆ పాత్రపై అసంతృప్తి.. విశ్వక్‌ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్‌ వార్నింగ్
ఆ పాత్రపై అసంతృప్తి.. విశ్వక్‌ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్‌ వార్నింగ్

Vishwak Sen: ఆ పాత్రపై అసంతృప్తి.. విశ్వక్‌ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్‌ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త తరహా కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'లైలా' చిత్రంలో అమ్మాయి వేషంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విశ్వక్‌ సేన్‌ చేసిన అమ్మాయి గెటప్‌ పెద్ద సాహసమే అయినప్పటికీ, సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్‌ సేన్‌ తన తదుపరి చిత్రం 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. 'జాతి రత్నాలు' ఫేమ్‌ అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

మాస్ ఇమేజ్ ను వదులుకోవద్దు

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 'లైలా' చిత్రంలో అమ్మాయి పాత్రలో తాను నటించడంపై నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వక్‌ వెల్లడించారు. 'లైలా సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్‌ అన్న, బాలకృష్ణ గారు నన్ను పిలిచి... ఇకపై ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పారు. ఇద్దరూ నాకు కొంచెం గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారని విశ్వక్‌ తెలిపారు. తన మాస్‌ ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లడం వారికి నచ్చలేదని, అందుకే తనకు తగ్గ సినిమాలనే చేయాలని వారు సూచించినట్లు విశ్వక్‌ సేన్‌ చెప్పారు.

Details

సంగీతాన్ని అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో  

ప్రస్తుతం 'ఫంకీ' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశ్వక్‌, ఈ చిత్రం కచ్చితంగా తనకు హిట్‌ అందిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కయదు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న, వాలెంటైన్స్‌ డేకి ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement