Lenin : అఖిల్ 'లెనిన్'లో డబుల్ క్లైమాక్స్..? మేకర్స్ మాస్టర్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్, 'ఏజెంట్' ప్లాప్ అనంతరం తన పూర్తి దృష్టిని ప్రస్తుతం 'లెనిన్'పై కేంద్రీకరించారు. రాయలసీమలోని చిత్తూరు ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్‌లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం చిత్రబృందం ఒక వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రెండు రకాల క్లైమాక్స్‌లను షూట్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదటి క్లైమాక్స్ పూర్తిస్థాయి మాస్ ఎలిమెంట్స్‌తో, అఖిల్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉండనుంది.
వివరాలు
జూన్ 26న విడుదలయ్యే అవకాశం
ఇక రెండో క్లైమాక్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇందులో హీరో పాత్రకు గ్రే షేడ్స్ చూపిస్తూ, ఊహించని ట్విస్ట్‌తో ముగింపు ఇస్తారని, అదే సమయంలో సీక్వెల్‌కు సంబంధించిన హింట్ కూడా అందించనున్నారని తెలుస్తోంది. ఈ రెండు క్లైమాక్స్‌లలో ఏదిని ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, సినిమా విడుదల తేదీపై కూడా క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదటగా మే 1న విడుదల కావాల్సిన 'లెనిన్' చిత్రం, రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' (ఏప్రిల్ 30)తో బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకు వాయిదా పడినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, 'లెనిన్' చిత్రం 2026 జూన్ 26న గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది.