Dragon: 'డ్రాగన్' ఫీవర్ స్టార్ట్.. హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఎన్టీఆర్ హంగామా
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ అమాంతం పెరుగుతున్నాయి. ఇంకా సినిమా నుంచి అధికారిక ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే ఈ చిత్రానికి సంబంధించిన హైప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్లాన్ చేసిన ప్రత్యేక ట్రీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రేపు ఎన్టీఆర్ బర్త్‌డే ఉండటంతో, ఈరోజే అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే ఈ వేడుకలకు సిద్ధమవుతుండగా, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు "డ్రాగన్" అనే టైటిల్ అనధికారికంగానే ప్రచారంలో ఉండేది.
వివరాలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
అయితే ఇప్పుడు పలు మల్టీప్లెక్స్ సంస్థలు తమ పోస్టుల్లో "డ్రాగన్" పేరునే ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇదే చిత్రానికి అధికారిక టైటిల్‌గా ఖరారయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ లో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. AMBసినిమాస్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్, అలాగే AAAసినిమాస్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఈ రాత్రి ఎన్టీఆర్ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. సోషల్ మీడియాలో ఈథియేటర్ల పోస్టులు ఇప్పటికే వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ ట్రీట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ రాత్రి 'డ్రాగన్' టైటిల్ అధికారిక ప్రకటనతో పాటు ఓక్రేజీ గ్లింప్స్ లేదా స్పెషల్ ట్రీట్ కూడా విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.