
Dunki Review : డంకీ రివ్యూ.. షారుక్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా..?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh Khan), అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ(Raj Kumar Hirani) తెరకెక్కించిన డంకీ (Dunki) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ ఇవాళ విడుదల అయింది.
పఠాన్, జవాన్ సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టడంతో డంకీ సినిమాపై అంచనాలు మిన్నంటాయి.
డంకీ మూవీ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాతో షారుక్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం..
హర్ఢీ సింగ్ థిల్లాన్ (షారుఖ్ ఖాన్) సైనికుడు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని వెతుకుతూ లల్టూ వస్తాడు. అక్కడ తాప్సి పరిచయం అవుతుంది.
Details
షారుక్ ఖాన్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా తెరకెక్కించిన డైరక్టర్
మను(తాప్సి), బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) పంజాబ్ లోని ఓ ఊర్లో నివసిస్తుంటారు. ఎలాగైనా లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు.
మనుతో పాటు మిగతా వాళ్ళు లండన్‌కు ఎలా వెళ్లారు? ప్రయాణంలో ఎదురైన కష్టాలు? లండన్ వెళ్లిన తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
మొదటి హాఫ్ అంతా సినిమాను కామెడీతో నడిపించారు.
ఇక సెకండ్ హాఫ్ అంతా అక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ల పడ్డ బాధలను చూపించారు.
షారుక్ ఖాన్ ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకులను ఏడ్చేలా చేశాడు.
ఇక విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ పాత్రలు కూడా మెప్పిస్తాయి.
మొత్తంగా షారుక్ గత సినిమాలతో పోలిస్తే ఈసారి ఎమోషనల్ టచ్‌తో ప్రేక్షకుల్ని నవ్వించి,ఏడిపించి మెప్పించాడు.