LOADING...
Rajinikanth: 'జైలర్‌ 2' తర్వాత రజనీ కొత్త అవతారం.. డాక్టర్‌గా అలరించనున్న సూపర్‌స్టార్
'జైలర్‌ 2' తర్వాత రజనీ కొత్త అవతారం.. డాక్టర్‌గా అలరించనున్న సూపర్‌స్టార్

Rajinikanth: 'జైలర్‌ 2' తర్వాత రజనీ కొత్త అవతారం.. డాక్టర్‌గా అలరించనున్న సూపర్‌స్టార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న 173వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యువ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయితే వచ్చే నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

చెన్నైలోని పూనమల్లిలో భారీ సెట్

ఈ సినిమాలో రజనీకాంత్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. చెన్నైలో ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ రూ.5 డాక్టర్‌ జీవిత స్ఫూర్తితో ఈ పాత్రను రూపొందించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే రజనీ పాత్రకు సంబంధించిన ప్రత్యేక ఫొటోషూట్‌ను చిత్ర బృందం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలోని పూనమల్లిలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఆ పనులు పూర్తయిన వెంటనే షూటింగ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌ 2' సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement