Vaishnavi: 'ఎపిక్' బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు: వైష్ణవి
ఈ వార్తాకథనం ఏంటి
'బేబీ' సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటించిన చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. సెప్టెంబర్ 11న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. '90s' వెబ్‌సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌లో వైష్ణవి చైతన్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమా కథలోని లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వైష్ణవి మాట్లాడుతూ.. సినిమాలో హీరో, హీరోయిన్ యూకేలో చదువుకునే క్రమంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటారని తెలిపారు.
వివరాలు
అవసరమైన మేరకే సన్నివేశాలను చూపించారు
అయితే లివ్-ఇన్ కథ అనగానే బోల్డ్ కంటెంట్, శృతిమించిన రొమాన్స్ ఉంటుందని భావించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఆదిత్య హాసన్ గతంలో తెరకెక్కించిన '90s' వెబ్‌సిరీస్ ఎంత క్లీన్‌గా ఉందో, 'ఎపిక్' కూడా అంతే క్లీన్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇందులో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కథలో కీలక అంశం.
అయినప్పటికీ కథకు అవసరమైన మేరకే సన్నివేశాలను చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలగకుండా, హద్దులు దాటకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించారు.
వివరాలు
నితిన్ తో జోడీ
కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని వైష్ణవి పేర్కొన్నారు.
ఇక తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.
అలాగే తమిళంలో రెండు, హిందీలో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 'బేబీ' జోడీ కావడంతో 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వంటి యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో సెప్టెంబర్ 11 తర్వాతే తేలనుంది.