Page Loader
పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల 
ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల

పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 18, 2023
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఫాహద్ ఫాజిల్, ధూమమ్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో హీరోయిన్ గా మెరిసిన అపర్ణ బాలమురళి, హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నోటికి ప్లాస్టర్ తో కనిపించాడు ఫాహద్ ఫాజిల్. ఈ ఫస్ట్ లుక్ ని సోషల్ మీడీయాలో రివీల్ చేసిన నిర్మాణ సంస్థ, నిప్పులేనిదే పొగ రాదని కొటేషన్ పెడుతూ, ఇదే మా అగ్నికణం అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా మళయాలంలో రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల