Aavesham 2: 'ఆవేశం 2'పై ఫహద్ ఫాజిల్ క్లారిటీ.. విడుదల అప్పుడే!
ఈ వార్తాకథనం ఏంటి
2024లో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఆవేశం'. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో సుమారు రూ.150 కోట్ల వసూళ్లు సాధించి సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఫహద్ తన రాబోయే సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
'పేట్రియాట్' చిత్రంలో విలన్‌గా..
ఒకేసారి తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నానంటే అందుకు దర్శకుల సహకారమే కారణమని ఫహద్ తెలిపారు. మమ్ముట్టి,మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న'పేట్రియాట్' చిత్రంలో తాను విలన్‌గా కనిపించబోతున్నట్లు చెప్పారు. అలాగే చాలా మంది ప్రేక్షకులు 'ఆవేశం 2' కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్న ఫహద్, ఆ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే దాన్ని 2027 లేదా 2028లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఆవేశం' మలయాళంలో థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికలపై కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ప్రస్తుతం జీతూ మాధవన్ సూర్య హీరోగా మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఫహద్ ఫాజిల్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.