
Robinhood: థియేటర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
థియేటర్స్‌లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటిటిలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను సాధించిన చిత్రాల్లో 'రాబిన్‌హుడ్' ఒకటి. నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మే 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం చిత్రానికి మంచి స్పందన లభించింది.
Details
యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును దాటేసిన మూవీ
ఉహించని మలుపులతో సాగే కథ, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ, యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును దాటేసింది. థియేటర్లలో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న 'రాబిన్‌హుడ్', ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను కూడా విశేషంగా మెప్పిస్తూ కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.