Loading...
Fauji vs Spirit: ఫౌజీ, స్పిరిట్ నుంచి ఒకే రోజు అప్‌డేట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ఫౌజీ, స్పిరిట్ నుంచి ఒకే రోజు అప్‌డేట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్!

Fauji vs Spirit: ఫౌజీ, స్పిరిట్ నుంచి ఒకే రోజు అప్‌డేట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

'రెబల్ స్టార్' ప్రభాస్ నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మూడు నెలల వ్యవధిలోనే ఈ సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాలకు సంబంధించి చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులను కాస్త టెన్షన్‌కు గురిచేసే ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తమ సినిమాల నుంచి ప్రత్యేకమైన అప్‌డేట్స్ ఇవ్వాలని 'ఫౌజీ', 'స్పిరిట్' మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

స్పిరిట్ నుంచి పవర్‌ఫుల్ యాక్షన్ గ్లింప్స్?

ముందుగా 'ఫౌజీ' డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 5న 'స్పిరిట్' థియేటర్లలో విడుదల కానుంది.

ప్రభాస్ పుట్టినరోజున 'స్పిరిట్' నుంచి అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇందులో భాగంగా సినిమా నుంచి పవర్‌ఫుల్ యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 'స్పిరిట్'పై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో యాక్షన్‌తో కూడిన గ్లింప్స్ విడుదలైతే సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

వివరాలు 

ఫౌజీ టీమ్ కూడా బర్త్‌డే ట్రీట్‌కు సిద్ధం!

మరోవైపు 'ఫౌజీ' చిత్రబృందం కూడా ప్రభాస్ పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అదే రోజున తమ సినిమా నుంచి వీడియో కంటెంట్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీంతో ఒకే రోజు ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు వస్తే సోషల్ మీడియాలో సహజంగానే పోలికలు మొదలయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇక్కడే అసలు క్లాష్ రూమర్..

'ఫౌజీ' సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుండటం మరో అంశంగా మారింది.

డిసెంబర్ 3న ఫౌజీ విడుదల కానుండగా.. స్పిరిట్ మార్చి 5న థియేటర్లలోకి రానుంది.

దీంతో ముందుగా విడుదలయ్యే సినిమాకే ప్రమోషన్స్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ భావించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ కారణంగానే 'ఫౌజీ' కోసం 'స్పిరిట్' బర్త్‌డే అప్‌డేట్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఇక్కడే అసలు క్లాష్ రూమర్..

అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఏదేమైనా.. ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ చిత్రాల నుంచి ఒకే రోజు అప్‌డేట్స్ వస్తాయన్న ప్రచారం, వాటి మధ్య మొదలైనట్లు చెబుతున్న చిన్నపాటి 'క్లాష్' ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

చివరకు ప్రభాస్ పుట్టినరోజున 'ఫౌజీ', 'స్పిరిట్' నుంచి ఎలాంటి ట్రీట్స్ వస్తాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT