LOADING...
Anaganaga oka Raju : జనవరి 14న థియేటర్లలో పండగ సందడి.. 'అనగనగా ఒక రాజు' రిలీజ్
జనవరి 14న థియేటర్లలో పండగ సందడి.. 'అనగనగా ఒక రాజు' రిలీజ్

Anaganaga oka Raju : జనవరి 14న థియేటర్లలో పండగ సందడి.. 'అనగనగా ఒక రాజు' రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అసలు సిసలైన పండుగ ఎంటర్‌టైనర్‌గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

Details

ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు

భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు మారి మాట్లాడుతూ సినిమాపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే చిత్రాన్ని పలుమార్లు చూసుకున్నామని, అలాగే చిత్ర బృందానికి చెందని కొందరికి ప్రత్యేక షోలు ఏర్పాటు చేసి సినిమా చూపించామని తెలిపారు. ఆ షోల సమయంలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారని, భావోద్వేగ సన్నివేశాలకు హత్తుకున్నారని చెప్పారు. సినిమా ముగిసిన వెంటనే అందరూ నిలబడి చప్పట్లు కొట్టడం తమకు అపారమైన సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

Details

జనవరి 14న రిలీజ్

'అనగనగా ఒక రాజు' సినిమా తమ రెండేళ్ల ప్రయాణమని పేర్కొన్న మారి, టీంతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా సినిమాను అంతగా ఆస్వాదించారంటే, పండగ సందర్భంగా ప్రేక్షకులంతా అదేస్థాయిలో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఫ్యామిలీతో థియేటర్‌కు వచ్చి సినిమాను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. తన సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో పూర్తిగా ఉంటాయని, అంతేకాదు అందమైన ఎమోషనల్ డ్రామా కూడా కీలకంగా ఉంటుందని చెప్పారు. ఆ భావోద్వేగ సన్నివేశాలను చూస్తూ తమ టీం మొత్తం కంటతడి పెట్టుకున్నామని తెలిపారు. జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి స్థాయి పండుగ అనుభూతిని అందించే బాధ్యత తమదేనని చెబుతూ, టికెట్ బుక్ చేసుకుని సినిమా చూసేందుకు రావాలని దర్శకుడు మారి కోరారు.

Advertisement