నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం
వ్రాసిన వారు
Naveen Stalin
February 18, 2023 | 10:41 pm
సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దఃఖసాగరంలో మునిగిపోయింది. తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. 2001లో సినీరంగ ప్రవేశం చేశారు. అదే ఏడాది ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అందులో 2002లో మొదట విడుదలైన ఒకటో నంబర్ కుర్రొడు సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.