Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా బలగం.. బెస్ట్ హీరోగా నాని
తెలంగాణ నేపథ్యంల రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ వేడుకలు హాజరయ్యారు. ఉత్తమ చిత్రంగా 'బలగం', దసరాలో నటకు గానూ బెస్ట్ హీరోగా నాని, ఉత్తమ దర్శకుడిగా వేణు నిలిచారు. కుటుంబ బంధాలతో తెరకెక్కిన బలగం భారీ విజయాన్ని అందుకొని ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మి అవార్డును అందుకున్నారు.
అవార్డులు పొందిన తెలుగు విజేతలు వీళ్లే..
ఉత్తమ చిత్రం- బలగం ఉత్తమ నటుడు- నాని (దసరా) ఉత్తమ నటి- కీర్తి సురేష్ (దసరా) ఉత్తమ దర్శకుడు- వేణు యెల్దండి (బలగం) ఉత్తమ పరిచయ దర్శకుడు- శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- సాయి రాజేశ్ (బేబి) ఉత్తమ నటి (క్రిటిక్స్)- వైష్ణవి చైతన్య (బేబి) ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ) ఉత్తమ సహాయ నటుడు- రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ) ఉత్తమ సహాయ నటి- రూప లక్ష్మీ (బలగం) ఉత్తమ గాయకుడు- శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీగా సత్యన్ నూరన్
ఉత్తమ గాయని- శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్) ఉత్తమ సాహిత్యం- అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ) ఉత్తమ సంగీతం- విజయ్ బుల్గానిన్ (బేబీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ- సత్యన్ సూరన్ (దసరా) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- కొల్లా అవినాష్ (దసరా) ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)